మొబైల్ యాప్

యాప్ సెట్టింగ్స్

మరి కొన్ని నోటిఫికేషన్ ఎంపికలు నేను ఎక్కడ చూడవచ్చు?

మన యాప్ సెట్టింగ్స్ లో, మీరు చాలా నోటిఫికేషన్స్ సెట్ అప్ చేయవచ్చు (లైన్ –అప్స్ ,గోల్ స్కోరర్స్ , రెడ్ కార్డ్స్ మొదలగునవి).

మ్యాచ్ లని అవి మొదలయ్యే సమయాన్ని బట్టి ఆర్డర్ చేయడం కుదురుతుందా?

కుదురుతుంది, సెట్టింగ్స్ మెనూ లో మీరు అలా చేయవచ్చు.”ఆర్డర్ మ్యాచెస్ బై” ని నొక్కి, మ్యాచ్ లని అవి మొదలయ్యే సమయాన్ని బట్టి ఆర్డర్ చేయడానికి “మ్యాచ్ స్టార్ట్ టైమ్”ని నొక్కండి.

డీఫాల్ట్ స్పోర్ట్ ని నేను మార్చవచ్చా?

మార్చవచ్చు,మా మెనూలో ఉన్న స్పోర్ట్స్ ని ఏదయినా మీరు డీఫాల్ట్ స్పోర్ట్ లాగా సెలెక్ట్ చేయవచ్చు. డీఫాల్ట్ స్పోర్ట్ మీ యాప్ లాంచ్ అయిన తర్వాత కనిపిస్తుంది.

యాప్ లాంచ్ అయిన వెంటనే నాకు నా ఆటలు/నా బృందాలు టాబ్ డీఫాల్ట్ గా కనిపించాలి.

ఈ ఎంపిక ఆండ్రోయిడ్ లో యాప్ సెట్టింగ్స్ లో అందుబాటులో ఉంది. ఐ ఓ ఎస్ యూసర్స్ కి మాత్రం లేదు : నా ఆటలు/నా బృందాలు టాబ్ కావాలంటే ఒకే ఒక విధానం (ఐ ఫోన్ 6s + కావలసిన) ని ఫోర్స్ టచ్ ద్వారా మాత్రమే.

యాప్ లో నేను వేరే టైమ్ జోన్ ని సెట్ చేయవచ్చా?

మీ డివైస్ లోని యాప్ టైమ్ జోన్ సెట్ ని ఉపయోగిస్తుంది.

యాప్ భాషని నేను ఎలా సెట్ చేయగలను?

మీ వద్ద ఐ ఓ ఎస్ డివైస్ ఉంటే, యాప్ సెట్టింగ్స్ లో భాషని మార్చవచ్చు .మా యాప్ లోని ఆండ్రోయిడ్ వెర్షన్ లో ఈ ఎంపిక లేదు.

ఫాంట్ సైజ్ ని ఎలా పెద్దగా చేయవచ్చు?

ఈ యాప్ మీ మొబైల్ డివైస్ లోని ఫాంట్ సైజ్ సెట్ ని ఉపయోగిస్తుంది. ఐ ఓ ఎస్ డివైస్ ‌లు ఫాంట్ సైజ్ మార్చడానికి అనుమతించవు.

మీ దగ్గర డార్క్ మోడ్ ఉందా?

ఉంది అంటే ,మీ యాప్ సెట్టింగ్స్ లో డార్క్ మోడ్ కి మారండి . ఐ ఓ ఎస్ యూసర్స్ కి గమనిక : డార్క్ మోడ్ కావాలంటే ఐ ఓ ఎస్ 13 అవసరం అవుతుంది.

నోటిఫికేషన్ సౌండ్ ని నేను ఎలా మార్చగలను?

ఆండ్రోయిడ్ డివైస్ లో ,మీ డివైస్ సెట్టింగ్స్ లో మీరు సౌండ్ ని సెట్ చేయవచ్చు. ఐ ఓ ఎస్ డివైస్ లలో ఈ ఎంపిక అందుబాటులో లేదు, కానీ భవిష్యత్తులో అది మారుతుంది

యాప్ లో నేను యాడ్స్ ని తొలగించడానికి డబ్బులు చెల్లించవచ్చా?

ఈ ఎంపిక ఐ ఓ ఎస్ డివైస్ ‌‌లకి మాత్రమే ఉంది.(ఉదాహరణకి ఆండ్రోయిడ్ డివైస్ ‌‌లకి లేదు ). ఐ ఓ ఎస్ యూసర్లు “రిమూవ్ బ్యానర్-యాడ్స్” అనే అంశాన్ని యాప్ సెట్టింగ్స్ లో చూడవచ్చు.